Sunday, May 19, 2024
- Advertisement -

ప్ర‌ధాని మోదీ రాజీనామా…

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ భారీ విజ‌యం సాధించ‌డంతో నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ సమర్పించారు. వెంట‌నె రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి ఆమోదించారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు ఆప‌ద్ద‌ర్మ పీఎంగా కొన‌సాగాల‌ని కోరారు రాష్ట్ర‌ప‌తి.

మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర కేబినేట్ స‌మావేశం జ‌రిగింది.కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభను రద్దు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు. జూలై 3వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది.దీనిలో భాగంగానే మోదీ మే 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7 గంటల సమయంలో 16వ లోక్‌సభలో మంత్రులుగా పనిచేసిన వారికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన సాయంత్రం వరకు ఢిల్లీ రావాలని బీజేపీ ఎంపీలను ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -