Sunday, May 19, 2024
- Advertisement -

ఒక్క ట్వీట్ తో దొరికేసిన పీవీ రమేష్..

- Advertisement -

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం పై మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ వాటిని డిలీట్ చేసి..మళ్ళీ ఏదో రాసి….. గందరగోళానికి గురయ్యారు…

తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు…. అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేసారు… దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది… అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు.

ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా విన్నకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్యపై ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేమి చూపించకుండా దరఖాస్తు చేసారని..అందుకే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేసారు… దీంతో అనవసరంగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా విమర్శలపాలయ్యింది అని కొందరు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -