సాధారణంగా వర్షం అంటూ బూడిద రంగు కలర్.. కొన్ని చోట్ల పరిసరాలను నేలను బట్టి ఆ రంగులో కనిపిస్తుంది. కానీ మలేషియాలో ఓ గ్రామంలో రక్తం రంగులో వర్షాని చూసి గ్రామస్తుల గుండె గుభేల్ అంది. నిన్న ఇండోనేషియాలోని జంగోగోట్ గ్రామాన్ని ముంచెత్తిన వరద నీరు మాత్రం పూర్తిగా ఎరుపు రంగులో అచ్చం రక్తంలా ఉందని చెబుతున్నారు.

వీధుల్లోకి వరద పెద్ద ఎత్తున వచ్చింది. అయితే ఈ వరద ఎర్రటి రక్తంలా ఉండడంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. తమ సెల్ ఫోన్లతో వీడియోలు తీసి నెట్టింట్లో పోస్ట్‌లు చేశారు. ఈ విషయమై స్పందించిన అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వర్షం కురిపించిన ప్రాంతానికి సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!