Monday, April 29, 2024
- Advertisement -

ఆ జీవో బాబే తెచ్చారు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫైర్‌!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎస్ఈసీకి పిచ్చి ముదిరిందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఏక‌గ్రీవాలు జోరుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ మాత్రం ఈ అంశంపై రోజుకో మాట మాట్లాడుతూ ఏక‌గ్రీవాల ఉనికినే ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

ఇక ఇప్పుడు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సైతం ఏక‌గ్రీవాల‌పై నిమ్మ‌గడ్డ తీరును త‌ప్పుబ‌ట్టారు. ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే ఏక‌గ్రీవాలు ఉన్నాయన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు సైతం వీటికి ప్రోత్సహకాలు ఇచ్చేందుకు వీలుగా జీవో తీసుకువ‌చ్చార‌ని గుర్తు చేశారు. అలాంటి ఈరోజే కొత్త‌గా ఏక‌గ్రీవాలు జ‌రుగుతున్న‌ట్లు చంద్ర‌బాబు మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ.. గృహ నిర్బంధం విధించడం ఏమిటని నిమ్మ‌గ‌డ్డ తీరును వంశీ విమ‌ర్శించారు.

విచారణ జరపకుండా నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారని ప్ర‌శ్నించారు. చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా? ఎస్ఈసీ చర్యలకు అన్నీ సరిపెడతామంటూ మండిప‌డ్డారు. ఏక‌గ్రీవాల‌పై గ‌గ్గోలు పెడుతున్న చంద్ర‌బాబు, టీడీపీ ఏకగ్రీవాలు కూడా బలవంతమేనా? అంటూ ప్ర‌శ్న‌లు వేశారు. అస‌లు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేరంటూ వంశీ టీడీపీ ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి చెప్పుకొచ్చారు. కాగా అత్య‌ధికంగా వైఎస్సార్ సీపీ మ‌ద్ద‌తుదారులే ఏక‌గ్రీవ స‌ర్పంచ్‌లుగా ఎన్నిక‌వుతున్న విష‌యం తెలిసిందే.

టిడిపిలోనే ఉంటాం, రాజీనామా వెనక్కి..

కేంద్రానికి భయపడి పవన్ సేమ్ గేమ్!

దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -