సెలబ్రెటీలు ఏం చేసిన ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. వారు మాట్లాడే ప్రతి పదం మరియు వారి చేసే ఏ సోషక్ మీడియా పోస్ట్ అయిన ఒకటికి పది సార్లు ఆలోచించి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసిన సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయాడం పక్కా. గతంలో పలువురు ఇలానే చేసి అడ్డంగా దొరికిపోయారు.
రీసెంట్ గా సానియా మీర్జా ఇదే మాదిరిగా చేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్‌లో ఒక మొబైల్‌కు సంబంధించిన యాడ్ మ్యాటర్ పోస్ట్ చేసింది. సానియా మీర్జా ట్విట్టర్‌లో.. తాను ఒక టెక్కీని కానప్పటికి గత కొన్ని నెలలుగా తాను వన్ ప్లస్ త్రీ టీ మొబైల్‌ను వాడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. చాలా సంతృప్తికరంగా ఆ ఫోన్ ఉందని కూడా ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ ఒక ఐఫోన్ నుండి వచ్చింది. అంటే సానియా మీర్జా ఐఫోన్ వాడుతుందని వెళ్లడైంది.
{loadmodule mod_custom,Side Ad 1}
గతంలో పలుసార్లు కూడా సానియా మీర్జా ఐఫోన్‌తోనే కనిపించింది. ఏదో ప్రచారం కోసం తాను వాడుతున్నాను, మీరు వాడండి అంటూ ట్వీట్ చేసి, ఇలా బుక్ అయ్యింది. నేను వాడుతున్నాను అనకుండా మంచి ఫోన్ అంటూ ట్వీట్ చేసినా బాగుండేది. ఆమె చిసిన ఈ చిన్న తప్పుతో ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సానియా మీర్జా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సానియాను బుద్ది లేదా అంటూ విమర్శించే వారు ఎక్కువ అయ్యారు. సానియా తన తప్పును తెలుసుకుని ఆ పోస్ట్‌ను తొలగించింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related