Monday, May 6, 2024
- Advertisement -

మ‌రోసారి ట్విట్ట‌ర్ పోస్టింగ్‌లో సోషియ‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిన లోకేష్‌..

- Advertisement -
Nara Lokesh Makes Another Mistake

త‌ప్పులు చేయ‌డం మాన‌వుని నైజం.. కానీ ఆ త‌ప్పులు మ‌ల్లీ జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డం వారి బాధ్య‌త‌. కాని ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు మంత్రి లోకేష్ ప‌రిస్థితి ఇప్పుడు కుడితిలో ప‌డిన ఎల‌క‌లాగా త‌యార‌య్యింది. మంత్రి కాక‌ముందు లోకేష్ ఎన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడినా దాన్ని ఎవ‌రూ ప‌ట్టింకోరు.మొద‌టి సారి త‌ప్పుచేస్తె ఏదో తెలియ‌ద‌నుకుంటారు..రెండోసారి త‌ప్పు చేస్తె ఏదోలె అనుకుంటారు. కానీ ఒక బాధ్య‌తా యుత‌మైన మంత్రి ప‌దవిలో ఉండి త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తె ఎవ‌రు ఊరుకుంటారు. అందులో సీఎం కొడుకు ఇక సోషియ‌ల్ మీడియా ఊరుకుంటాదా. ఏరేంజ్‌లో ఉతికి ఆరేసిందో అంద‌రికీ తెలిసిందే.

ఒక ప్రముఖ నేత వారసుడి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఆయన మాటలు.. చేతలు ఇలా అన్నింటిపైనా ఒక కన్నేసి ఉంటారు ప్రజలు. ఇలాంటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.ఏమాట మాట్లాడినా అది ప్ర‌జ‌ల‌కు చేరిపోతుంది.తన మీద వచ్చే విమర్శలు.. ఆరోపణల విషయంలో ఆయన బ్యాలెన్స్చ చేసుకోవాలి త‌ప్ప …తనను తప్పు పట్టే వారిపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటివి మరింత నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తాయన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం చినబాబుకు ఉంది.నిన్నటి వరకూ మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లగా.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో తప్పు దొర్లటం గమనార్హం.తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో తప్పు దొర్లటంతో మ‌రోసారి సోషియ‌ల్ మీడియాకు చిక్కారు చిన‌బాబు.

ట్విట్ట‌ర్‌లో త‌న‌వైన శైలిలో దూసుకుపోతున్న లోకేష్‌కు అంతే స్తాయిలో ఆయ‌న‌మీద జోకులు పేలుతున్నాయి.తాజాగా ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన పోస్ట్ సోషియ‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో మండలి ఛైర్మన్ చక్రపాణిని కలుసుకోవటం సంతోషంగా ఉందంటూ చినబాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఒక ఫోటోను జత చేశారు. అయితే.. ఆయన జత చేసిన ఫోటోలో చక్రపాణి లేకపోవటంక‌తో ట్విట్ట‌ర్స్ అవాక్క‌య్యారు.కొద్దిసేప‌టికి లోకేష్ స్నేహితులు చూసి పోన్ చేసిన త‌ర్వాత ..పాత ట్విట్‌ను తొల‌గించి చ‌క్ర‌పానిని క‌ల‌సిన పోటోను ట్విట్ చేశారు.

అప్ప‌టికే జ‌ర‌గిపోవాల్సిన త‌తంగం జ‌రిగిపోయింది. గంలో నీటి సమస్య సృష్టించడమే నా లక్ష్యం అని ఒకసారి, మీ అందరికి అంబేద్కర్ వర్థంతి శుభాకాంక్షలు అని మరోసారి నోరుజారి నవ్వులపాలయ్యారు లోకేష్. పోనీలే అనుభవం లేదు కదా ముందు ముందు రాటుదేలుతాడులే అని టీడీపీ నాయకులు అనుకున్నారు. కానీ లోకేష్ మాత్రం అస్సలు మారలేదు. మరోసారి ఆయన తెలివితక్కువ వ్యాఖ్యలు,ట్విట్‌లు చూస్తె టీడీపీ నాయ‌కులకు నోట మాట రావ‌డంలేదు. ఒక బాధ్య‌తా యుత‌మైన ప‌దవిలో ఉన్న లోకేష్ ఇక‌నుంచైనా జాగ్ర‌త్తాగా ఉండ‌క‌పోతే మున్ముందు క‌ష్ట‌మే.

Related

  1. లోకేష్‌కు ప్ర‌మోహ‌ష‌న్‌.. సీనియ‌ర్ల‌కు డిమోష‌నా…
  2. లోకేష్ మ‌ళ్లీ ఎక్క‌డ నోరు జారుతార‌నే విదేశీప‌ర్య‌ట‌న‌ నుంచి త‌ప్పించారంట‌
  3. మంత్రుల ముందు లోకేష్ ఓ రెంజ్ లో సీరియస్ అయిన చంద్రబాబు
  4. లోకేష్‌పై జ‌గ‌న్ పంచ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -