ఇకపై టెన్నిస్ ఆడను.. సానియా మీర్జా సంచలనం

- Advertisement -

భారత టెన్పిస్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది తర్వాత తాను టెన్పిస్ కు గుడ్ బై చెబుతానని వెల్లడించింది. 2022 సీజన్ తర్వాత తాను రాకెట్ పట్టబోనని చెప్పింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో ఓటమి అనంతరం ఆమె తన భవిష్యత్ కార్యాచరణను సానియా ప్రకటించారు.

‘‘ నా రిటైర్మెంట్ నిర్ణయానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల కొంతకాలంగా గాయాలు త్వరగా మానడం లేదు. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. నాకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుత కరోనా సమయంలో ఎక్కువగా ప్రయాణం చేసి నాకుటుంబ సభ్యులను ప్రమాదంలోకి నెడుతున్నానా అని అని పిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయంచుకున్నా ’’ అని సానియా తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా ఆరేళ్ల వయస్సు నుంచే టెన్నిస్ ఆడుతూ 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రీడా కారిణిగా అనేక టోర్నీలలో అడుగుపెట్టారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆడారు. ప్రపంచ టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్లో కెరీర్లో అత్యత్తుమ 27వ ర్యాంకును సాధించారు. నేటి వరకు భారత నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా సానియానే కొనసాగుతున్నారు.

Also Read: పేలిన అగ్నిపర్వతం.. సునామి తప్పదంటున్న సైంటిస్టులు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -