Friday, May 17, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు!

- Advertisement -

ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో టిడిపి చంద్రబాబు ఫోన్‌ని ట్యాప్ చేశారని ఆరోపిస్తోంది. ఈ  ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రింకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. కాల్ డేటా ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని కంపెనీలు

తెలుపుతూ రెండు రాష్ట్రాల మధ్య తాము నలుగుతున్నామని కంపెనీల ప్రతినిదులు పేర్కొన్నారు. అయితే వారం రోజుల తర్వాత విజయవాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని ,వాటిని సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ,మూడువారాల తర్వాత కవర్ ఓపెన్ చేయాలని సుప్రింకోర్టు సూచించింది. నెల రోజుల తర్వాత విచారణ చేపట్టవచ్చని సుప్రింకోర్టు విజయవాడ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోన్ టాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. కాల్ డేటా లో ఏమైనా కొత్త విషయాలు దొరకుతాయా?ట్యాపింగ్ కు సంబందించిన ఆదారాలు దొరుకుతాయా?అన్నది ఆసక్తికరమైన అంశం గా ఉంది. తాము కాల్‌డేటాను ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రొవైడర్లు చెపుతూ, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూట్‌ చేస్తామని బెదిరిస్తుందని, కోర్టు ఆదేశాలు ఉన్నంత వరకు ఎవరి బెదిరింపులను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఈ మలుపుతో తెలంగాణ ప్రభుత్వం ఎలా అడుగు వేయబోతుందో చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -