Thursday, May 2, 2024
- Advertisement -

రికార్డు రేటింగ్ సాధించిన షాదీ ముబారక్ సినిమా…!!!

- Advertisement -

గత శుక్రవారం(మార్చి 5) రిలీజ్ అయిన షాదీ ముబారక్ కలెక్షన్స్ పెద్దగా రాబట్టలేకపోయినా కాని ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మొగలిరేకులు సీరియల్ హీరో ఆర్ కే నాయుడు (సాగర్) వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.

పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ.సీరియస్ పాత్రల నుండి ఒక పక్కింటి కుర్రాడు పాత్రకి సాగర్ మారిన తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి.

తొలి చిత్రం తోనే తెలుగులో చాలా మంచి పేరును తెచ్చుకుంది దృశ్య . ఈ అమ్మాయి చలాకీ తనం తెరమీద మరో సాయిపల్లవిని గుర్తు చేసింది. ఏ సినిమాకైనా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్ హార్షం వ్యక్తం చేయడం జరిగింది.

కాని ఒకటే బాధకారం ఈ సినిమా ఇంత మంచి రేటింగ్ సాధించినప్పటికి వసూళ్లు పెద్దగా రాబట్టలేకపోతుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు.’ షాదీ ముబారక్” ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది.

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

ఏప్రిల్‌ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం..!

ఎవరు ఎక్కడ ఓటు వేశారు.. ఏం అన్నారు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -