Thursday, May 2, 2024
- Advertisement -

మహేష్ తో మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి!

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాని జక్కన్న శిల్పన్ని చెక్కినట్టు చెక్కుతాడు రాజమౌళి. అందుకే ఆయన్ని ఇండస్ట్రీలో జక్కన్న అని పిలుస్తుంటారు.ప్రతి ఒక్క హీరో ఆయనతో సినిమా చెయ్యాలని కలలు కంటుంటారు.ఇక ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం పడుతుందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రాజమౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను తెరకెక్కిస్తుండటంతో ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

2012 సంవత్సరం జులై నెలలో ఈగ సినిమా విడుదల కాగా గత ఎనిమిదేళ్లలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఏడాది దసరా పండుగకు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే మహేష్ సినిమాను కూడా రాజమౌళి మూడేళ్లు తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం అందుతుంది.రాజమౌళి సినిమా అంటే ఆ సమయంలో మరో సినిమా చేయడానికి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. అందువల్ల మహేష్ బాబు పూర్తి సమయం రాజమౌళి సినిమాకే కేటాయించాల్సి ఉంటుంది. రాజమౌళి త్వరగా పూర్తి చేస్తానని చెప్పినా గతంలో ఆయన సినిమాలు చెప్పిన డేట్ కు రిలీజ్ కావడం అరుదుగా జరిగింది. మరి మహేష్ రాజమౌళి సినిమా కోసం మూడేళ్లు కేటాయిస్తారో లేదో చూడాల్సి ఉంది.

రికార్డు రేటింగ్ సాధించిన షాదీ ముబారక్ సినిమా…!

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

ఏప్రిల్‌ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం..!

ఎవరు ఎక్కడ ఓటు వేశారు.. ఏం అన్నారు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -