Thursday, May 16, 2024
- Advertisement -

రూపాయి కోసం బస్సులు ఆపేశారు

- Advertisement -

కండక్టరుతో ప్రయాణికులకు జరిగిన ఒక్క రూపాయి చిల్లర వివాదంతో హైదరాబాద్ నగరం లో దాదాపు సగం బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మిక వర్గాల సమాచారం ప్రకారం ఉప్పల్ డిపోలో పనిచేసే రత్నకుమారి అనే కండక్టర్ కు, ఓ ప్రయాణికురాలిపై మధ్య వాగ్వాదం జరిగింది.

ప్రయాణికురాలికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉండగా కండక్టరు లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీనితో ప్రయాణికురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కండక్టర్ రత్న కుమారిని సస్పెండ్ చేశారని తెలుస్తోంది.

దీనికి నిరసనగా హైదరాబాద్ రీజియన్ పరిధిలోని కొందరు కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.దీనితో ఉదయం నుంచి నగరంలో బస్సులు ఎక్కువగా తిరగకపోవడంతో ఏం జరిగిందోనన్న విషయం కూడా సామాన్యులకు తెలియలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -