Sunday, May 19, 2024
- Advertisement -

ఓటుకునోటు కేసులో కీల‌క మ‌లుపు…

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో చెప్ప‌న‌క్క‌ర‌లేదు. తెలంగాణా ఆంగ్లో-ఇండియ‌న్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను కోనుగోలు వ్య‌వ‌హారంలో రేవంత్‌రెడ్డితోపాటు బాబుకూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సంగ‌తి తెలిసిందె. మొద‌ట్లో కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా సాగినా త‌ర్వాత దాన్ని అడుగున ప‌డేశారు. అయితె ఇప్పుడు తాజాగా ఓటుకు నోటు కేసు కీల‌క మ‌లుపు తిరిగింది.

ఇప్ప‌టికె ప‌లు కేసుల‌తో చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వానికి మూడు చె రువులు నీల్లు తాపుతూ అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై ఆర్కె సుమారు 35 కేసులు వేశారు. అందులో చాలా వరకూ హైకోర్టులో వివిధ దశల్లో ఉండగా మరి కొన్ని సుప్రింకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. తాజాగా ఓటుకునోటు కేసులో కూడా ఆర్కె వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మెయిన్ కేసుతో జత చేసి విచారించాలని సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఓటుకునోటు కేసును సిబిఐ తో విచారణ జరిపించాలని ఆర్కె ఆమధ్య ఓ పిల్ దాఖలు చేసారు. ఆ కేసే సోమవారం విచారణకు వచ్చింది. ఎంఎల్ఏ తరపు న్యాయవాది వాదనలు విన్న సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్కె పిటీషన్ ను మెయిన్ కేసుకు జత చేసి విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో చంద్ర‌బాబుకు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇద్ద‌రి సీఎం మ‌ధ్య అన‌ధికారికంగా జ‌రిగిన ఒప్పందం ప్ర‌కార‌మె కేసు ముందుకు సాగ‌డంలేద‌న్న ఆరోప‌న‌లు బ‌లంగా వినిపించాయి.

ఈకేసును ఇప్ప‌టివ‌ర‌కు రెండు రాష్ట్రాల ఏసీబీ అధికారులే విచారిస్తున్నారు. ఏసీబీ అంటె రాష్ట్ర‌ప‌రిధిలోనిది. సుప్రింకోర్టులో ఆళ్ళ వేసిన కేసు ప్రకారం ‘ఓటుకునోటు’ కేసును సిబిఐ కి అప్పగిస్తే మొత్తం సీన్ మారిపోతుంది. అప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని ప్రచారం మొదలైపోయింది. మ‌రో ఏడాదిన్న‌ర్ర లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్నాయికాబ‌ట్టి సీబీఐ యాక్టివేట్ అయితె చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌తంగానె కాకుండా పార్టీకి కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌రి చూడాలి ఈకేసు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -