Thursday, May 16, 2024
- Advertisement -

ప్రియురాలికోసం మ‌తం మార్జుకున్న ప్రియుడు…షాక్ ఇచ్చిన  ప్రియురాలు

- Advertisement -

ప్రేమించిన అమ్మాయికోసం ప్రియుడు మ‌తం మారాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. కానీ ప్రియుడికి ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడా యువతి తల్లిదండ్రులే కావాలని కోరుకుంటోంది. మేజర్‌ అయిన ఆ యువతి కోరికను కాదనలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజలి జైన్‌(23), మహ్మద్‌ ఇబ్రహీం సిద్ధిఖి (33)లు ప్రేమించుకున్నారు. వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటే తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, అందువల్ల సిద్ధిఖిని మతం మారాల్సిందిగా అంజలి కోరింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23 న సిద్ధిఖి ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారాడు. మహ్మద్‌ సిద్ధిఖి కాస్తా ఆర్యన్‌ ఆర్యగా మారాడు. అనంతరం అంజలి, ఆర్యన్‌లు ఫిబ్రవరి 25న హిందూ సాంప్రదాయం ప్రకారం రాయ్‌పూర్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

Image result for girl-does-a-u-turn-in-supreme-court-prefer-parents-to-husband

అయితే, తన భార్య తల్లిదండ్రులు, హిందూ వర్గాలు విడాకులు ఇవ్వాలని తనను బలవంతం చేస్తున్నారని ఆగస్టు 17 న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం సర్వోన్నత న్యాయస్థానంలో అర్యన్ తరఫున న్యాయవాది నిఖిల్ నయ్యర్ పిటిషన్ దాఖలు చేశాడు.

అతడి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆర్యన్ చేస్తోన్న ఆరోపణల్లో నిజానిజాలను తెలుసుకోడానికి భార్యను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ధామతరయ్ జిల్లా ఎస్పీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెను సోమవారం ధర్మాసనం ముందుంచారు.

అంతకు ముందు రాష్ట్ర ఆడ్వకేట్ జనరల్ జుగల్ కిశోర్ గిల్డా ఈ కేసు గురించి వివరిస్తూ.. గతంలో ఆర్యన్ రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం దాచిపెట్టి మూడోసారి హిందూ యువతిని వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యువతి అభిప్రాయాన్ని చెప్పాలని ధర్మాసనం పేర్కొంది.

తాను ఆర్యన్‌ను ఇష్టపడి వివాహం చేసుకున్నా, తల్లిదండ్రులతోనే కలిసుంటానని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయంలో తల్లిదండ్రుల ఒత్తిడి ఏమాత్రం లేదని వెల్లడించింది. దీంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అతడితో ఉండానికి ఆమె నిరాకరిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆమె ఓ మేజర్.. తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఆ మహిళకు ఇవ్వాలి.. ఒకవేళ భర్తతో ఉండటానికి ఆమె సుముఖత వ్యక్తం చేయకపోతే, ఇది వివాహ సంబంధ కేసువుతుంది… దీనిపై న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం ఆదేశించింది. అనుకోని మలుపుకు షాక్‌కు గురైన సిద్ధిఖి ‘నేను తన కోసం మతం మార్చుకున్నాను. కానీ ఆమె తన తల్లిదండ్రుల కోసం మనసు మార్చుకుంది. తన తల్లిదండ్రుల బలవంత మేరకే ఆమె అలా మాట్లాడింద’ని సిద్ధిఖి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -