Thursday, March 28, 2024
- Advertisement -

కొత్తగా ట్రై చేశారు.. ఇంప్లిమెంటేషన్‌ ఫెయిల్.. ఏం జరిగింది..?

- Advertisement -

వివాహం అనేది జీవితంలో ఒకే ఒకసారి జరిగే వేడుక. దీంతో చాలా మంది యువతీ యువకులు తమ పెళ్లి వేడుకలను మధుర స్మృతులుగా మలుచుకోవాలని ఆరాట పడతారు. వినూత్నంగా, అందర్నీ ఆకట్టుకునేలా వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆరాట పడే జంటలెన్నో. పెళ్లి వేడుకలను మెమరబుల్ ఈవెంట్‌గా మలుచుకోవడం కోసం ఖర్చుకు వెనకాడని వారు బోలెడంత మంది. ఇక పెద్దవాళ్లకైతే.. తమ పిల్లల పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం స్టేటస్ సింబల్‌గా మారింది. ఈ క్రమంలోనే బోలెడన్నీ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థలు పుట్టుకొచ్చాయి.

వధూవరుల అభిరుచులకు అనుగుణంగా.. వారి బడ్జెట్లో పెళ్లి, సంగీత్ వేడుకలు నిర్వహించడం ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి వేడుకల్లో డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయడం.. ఇంకాస్త సంపన్నులైతే క్రేన్లను వాడటం కామన్‌గా మారింది. సంగీత్ వేడుకలను విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఓ కొత్త జంటను వినూత్నంగా అందరికీ పరిచయం చేయాలని సంగీత్ వేడుకల నిర్వాహకులు భావించారు. అందంగా ముస్తాబు చేసిన సర్కిల్ లాంటి ప్లాట్ ఫామ్ మీద పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని ఉంచి.. భారీ క్రేన్ సాయంతో.. ఆ సర్కిల్‌ను గాల్లో వేలాడేలా చేసి.. వధూవరులను అందరికీ కనిపించేలా చూపించాలనేది అసలు ప్లాన్. ఆ సర్కిల్ మీద నిలబడిన వధూవరులు గాల్లో తేలియాడుతున్న అనుభూతి చెందుతుంటే.. వెనుక నుంచి స్టేజ్ మీద డ్యాన్సర్లు స్టెప్పులేస్తుంటే.. ఆ సీన్ చూస్తే వచ్చే కిక్కే వేరని అనుకున్నారంతా.

కానీ ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో చిన్న తప్పిదం దొర్లడంతో.. అంతా బెడిసి కొట్టింది. క్రేన్‌ సాయంతో వృత్తాకార స్ట్రక్చర్‌‌ను పైకి లాగుతుండగా.. దానికున్న రోప్ పక్కకు జారింది. దీంతో దాదాపు 12 అడుగుల ఎత్తు నుంచి వధూవరులిద్దరూ కింద పడిపోయారు.

ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అక్కడేం జరుగుతుందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. కాసేపటి తర్వాత తేరుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పరిగెత్తుకుంటూ వెళ్లి వధూవరులను పైకి లేపారు.

గత వారం చివర్లో రాయ్‌పూర్‌లోని హోటల్ సాయాజీలో నిర్వహించిన సంగీత్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంత ఎత్తు నుంచి కింద పడినప్పటికీ.. లక్కీగా ఆ కొత్త జంటకు పెద్ద గాయాలేవీ కాలేదు.

ఓ 15 నిమిషాల పాటు అక్కడంతా గందరగోళంగా ఉన్నప్పటికీ.. కాసేపటి తర్వాత అంతా తేరుకున్నారు. ఈవెంట్ ప్లానర్స్ సెలబ్రేషన్స్‌ను కొనసాగించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరబాట్లు దొర్లకుండా చూసుకుంటామని ఈవెంట్ ప్లానింగ్ సంస్థ వెల్లడించింది.

https://twitter.com/GabbbarSingh/status/1465296424095010819

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -