Friday, May 17, 2024
- Advertisement -

మహిళల ప్రవేశంపై తీర్పివ్వని న్యాయస్థానం…

- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్ర‌వేశం లేనిది తెలిసిందే. బరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టి మహిళల ప్రవేశానికి సంబందించి 6 సందేహాలను లేవనెత్తి.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

ప్రస్తుతం 10 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యనున్న ఆడవాళ్లను ఆలయంలోకి అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం ఇలా ఏలా చేస్తారని కోర్టు జనవరి 2016లో ఆలయ బోర్డును ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అంశంపై తన ఉత్తర్వులను రిజర్వ్‌లో పెట్టింది.

యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే సంస్థ, అయ్యప్ప దేవాలయంలో లింగ వివక్ష అమలవుతోందని కేసు వేయడంతో జనవరి 2016 నుంచి సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -