Saturday, April 27, 2024
- Advertisement -

సీజేఐ ముందుకు చంద్రబాబు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం విభజన తీర్పును వెలువరించింది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు నివేదించారు.

తన అరెస్టు సమయంలో సెక్షన్ 17ఏ పాటించలేదని, ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు లాయర్లు వాధించారు. సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని డివిజనల్ బెంచ్ విజ్ఞప్తి చేసింది.

తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు, ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు ఆ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -