Saturday, April 27, 2024
- Advertisement -

సుప్రీం ముందుకు స్కిల్ స్కాం కేసు..

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఇక దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా ఇది మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో హైకోర్టు తన పరిధి దాటిందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. బెయిల్‌ కేసు విచారణ సమయంలో హైకోర్టు మినీ ట్రయల్‌ నిర్వహించడంతో పాటు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పొరబడిందని పిటిషన్‌లో పేర్కొన్న సీఐడీ…చంద్రబాబు బెయిల్‌ను రద్దుచేయాలని కోరింది.కేసు మెరిట్స్‌పై అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించింది కాబట్టి ఆ తీర్పును కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కాం జరిగింది. నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఒప్పందం రాగా జర్మనీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సీమెన్స్ 90 శాతం,ప్రభుత్వం 10 శాతం చెల్లించేలా అగ్రిమెంట్ అని ప్రచారం చేశారు. కానీ ఆఘమేఘాల మీద 10 శాతం వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లించారు. అధికారులు ఒప్పుకోకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు చేశారు. ఇదే విషయాన్ని ఫైళ్లలో రాశారు అధికారులు. షెల్ కంపెనీల తర్వాత రూ. 241 కోట్లు పక్కదారి పట్టగా విషయం బయటకి రావడంతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఇక సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేయగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -