Sunday, May 12, 2024
- Advertisement -

మరీ ఇంత బిల్డప్పా… సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు హెలికాప్టర్ లో వచ్చాడు!

- Advertisement -

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.  ఇక గెలిస్తే ఆ ఆనందం మామూలుగా ఉండదు. మందీమార్బలంతో, డప్పుల చప్పుళ్లతో, బాణసంచా కాలుస్తూ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి ప్రమాణస్వీకారానికి ఏకంగా హెలికాప్టర్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పారిశ్రామికవేత్త జలిందర్ గగరె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అహ్మద్ నగర్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం అంబీ దుమాలాలో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. అసలు బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్.. మరి ఆయన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని భావించారో ఏమో.. పూణె నుంచి ఆయన హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అంతేకాదు, గ్రామంలోని ఆలయాలపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన పూణెలో ఉంటారు. బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. మరోవైపు జలిందర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసమే తాను సర్పంచ్ గా పోటీ చేశానని చెప్పారు.

బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన బంగారం.. అదేబాటలో వెండి!

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

దాల్చిన చెక్క‌తో క‌లిగే లాభాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -