Saturday, April 27, 2024
- Advertisement -

బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన బంగారం.. అదేబాటలో వెండి!

- Advertisement -

గత కొన్ని రోజులుగా బంగారం ధర వరుసగా పడిపోతూ వస్తుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. బంగారం తో పాటు ఇప్పుడు వెండి ధరలు కూడా నేలవంక చూస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో పతనం నమోదైంది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.600 తగ్గి.. రూ.69,600 వద్ద నమోదైంది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 దిగొచ్చింది. దీంతో రేటు రూ.47,730కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 క్షీణతతో రూ.43,750కు తగ్గింది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1400 తగ్గి రూ.73,600గా ఉంది.

విజయవాడ, విశాఖ పట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక చెన్నైలోనూ కిలో వెండి రూ.రూ.73,600గా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

మళ్ళీ హీరోగా సినిమా చేస్తున్న అవసరాల శ్రీనివాస్!

సాకుగా చూపి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -