Tuesday, May 21, 2024
- Advertisement -

మ‌రోసారి రెచ్చిపోయిన టీడీపీ నాయ‌కులు… పెందుర్తిలో మ‌హిళ‌పై దాడి

- Advertisement -

తెలుగుదేశం పార్టీ నాయ‌కుల దాడులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతూనే ఉన్నాయి. దాడులు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల‌పైనే కాకుండా, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌పై, త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌వారిపై దాడులు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం అని అన‌డం త‌ప్పేం కాదు. ఆ విధంగా ఏపీలో అధికార పార్టీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు దాడులు జ‌రుగుతున్నాయి. వృద్ధుడు, మ‌హిళ‌లు, దివ్యాంగులు అని కూడా చూడ‌కుండా వారి అర‌చకాలు, దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది.

సభ్యసమాజం తలదించుకునేలా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మహిళపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. తమ కబ్జాకు వ్య‌తిరేకంగా ఉన్న ఆమెను భ‌యాందోళ‌న‌కు గురిచేసి స్వాధీనం చేసుకునే ప‌నిలో ప‌డి ఈ అరాచ‌క‌త్వానికి తెర లేపారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెందుర్తి వైస్‌ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడు ఆమెపై దాడికి పాల్ప‌డ్డారు. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు.

పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం సర్వే నంబర్‌ 77లోని భూమిని ఏళ్ల కింద‌ట దళిత కుటుంబాలకు కేటాయించారు. తరువాత కొన్నాళ్లకు అదే భూమిలో ఏపీ బేవరేజేస్‌ బాట్లింగ్‌ కంపెనీకి కొంత స్థలం కేటాయించారు. మిగిలిన 80 సెంట్ల స్థలాన్ని 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. విలువైన ఈ స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా దళితులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇదే స్థలాన్ని టీడీపీ మద్దతుదారులకు కేటాయించేలా చేశారు. మంగళవారం ఆ స్థల స్వాధీనానికి టీడీపీ నాయకులు వెళ్లారు. దళితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ దారుణానికి పాల్పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -