Monday, May 5, 2025
- Advertisement -

నంద్యాల‌లో టీడీపీ ఆశీర్వాద యాత్ర‌…షురూ..!

- Advertisement -
TDP Starts Ashirwad Yatra in Nandyal for By election

నంద్యాల ఉప ఎన్నిక రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారాయి.అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే రంగంలోకి దిగింది అధికార‌పార్టీ. ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే నంద్యాల రాజకీయం వేడెక్కింది. టీడీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించి నిరాశకు గురైన శిల్పా మోహన్ రెడ్డి చివరకు వైసీపీలో చేరి టికెట్ సాధించారు.

మరోవైపు, నంద్యాల టికెట్ తమ కుటుంబీకులకే ఇవ్వాలంటూ పట్టుబట్టిన మంత్రి అఖిలప్రియ… చివరకు తన పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలీకృతం అయ్యారు. ఉప ఎన్నికలో పోటీ చేయబోయే ఇరు పార్టీల అభ్యర్థులు తేలిపోవడంతో… అప్పుడే ఇరు పార్టీలు ఎన్నికలో విజయం కోసం ఎత్తులు పైఎత్తులు ప్రారంభించాయి.

{loadmodule mod_custom,GA1}

ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.ఈఉప ఎన్నిక టీడీపీకి రెఫ‌రెండ‌మ్‌లాంటిదే.అటు వైసీపీకూడా చావోరేవో అన్న‌చందంగా ఉంది.బాబు ఇప్తార్ విందుతో నంద్యాల‌లో ప్ర‌చారానికి తెర‌లేపారు.మంత్రులు నారాయ‌ణ‌,కాల్వ శ్రీనివాసుల‌కు అన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు సీఎం.
ఈఎన్నికపైనే అఖిల భ‌విష్య‌త్తు,శిల్పా ఉనికి ఆదార‌ప‌డింది.అందుకే ఇద్ద‌రు స‌వాల్లు,ప్ర‌తిస‌వాల్లు చేసుకున్న సంగ‌తితెలిసిందే. ఆల‌స్యం చేయ‌కుండా ఓటర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి టీడీపీ ఆశీర్వాద యాత్ర’ పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. తమకు అండగా ఉండాలని ఓటర్లను అభ్యర్థించనుంది.
ఈ యాత్రను ప్రారంభించే ముందు వీరిద్దరూ ఆళ్లగడ్డలో ఉన్న భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించారు. నంద్యాల ప్ర‌జ‌లు ఎవ‌రిని ఆశీర్వ‌దిస్తారో.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}sL4nrFh894w{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -