Monday, May 6, 2024
- Advertisement -

ఎప్పుడూ లేనిదే నంద్యాల నియేజ‌క‌వ‌ర్గంమీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా….!

- Advertisement -
All TDP Ministers Way to Nandyal for by election

నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తలు ఎవ‌ర‌నేదానిపై ఇన్నాల్లు ఉన్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఇరు పార్టీల నేత‌లు త‌మ అభ్య‌ర్తుల‌ను దాదాపు ఖ‌రారుచేశారు… అదికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి.

ఉప ఎన్నిక బాబు ప‌రిపాల‌న‌కు రెప‌రెండమ్‌లాంటిదే. ఓడిపోతే బాబు ప‌రువు గంగ‌లో క‌ల‌సిపోతోంది. అందుకే మంత్రివ‌ర్గాన్నంతా నంద్యాల నియేజ‌క‌వ‌ర్గంలోనే మోహ‌రించారు.

నంద్యాల ఉప ఎన్నికల ని చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఆయన అనుకున్నట్టే అభ్యర్ధి పేరు బయటకి ఓకే చేసి ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ రంగం లోకి దిగిపోయాయి. ఉప ఎన్నిక గెలుపు టీడీపీకి జీవ‌న్మ‌ర‌న స‌మ‌స్య‌గామారింది.ఒక వేల గెలిస్తే రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చున‌ని బాబు ఆలోచ‌న‌.ఇందుకోసం భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డి నంద్యాల అభ్యర్ధి గా శనివారం ఖరారు అయ్యారు.

{loadmodule mod_custom,GA1}

ఉప ఎన్నిక అయిపోయేంత‌వ‌ర‌కు నిధుల‌కు సంబందించి నారాయ‌ణ‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.అనుకున్న‌దే త‌డువుగా మంత్రి నారాయణ తో సహా ఇతర టీడీపీ పెద్దలు నంద్యాల వీధుల్లో తిరుగుతూ పారిశుధ్య పరిస్థితి ఎలా ఉందోన‌ని ప‌రిశీలించారు.ఈ ఉప ఎన్నిక మీద టీడీపీ ఎంత సీరియస్ గా ఉంది అనడానికి మంత్రి నారాయణ టూర్ ఒక్కటి చాలు అంటున్నారు విశ్లేషకులు.
ప్ర‌జ‌లు మాత్రం మ‌రోలా అనుకుంటున్నారు. ఉన్న‌ట్టుండి ఇప్పుడే అభివృద్దిమీద ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింద‌ని మాట్లాడుకుంటున్నారు.ప్ర‌జ‌ల అభివృద్దికాదు ప్రభుత్వానికి నంద్యాల మీద విపరీతమైన ‘ఎలక్షన్’ ప్రేమ పుట్టుకొచ్చేసిందంటున్నారు ప్ర‌జానీకం.నారాయ‌న‌తోపాటు రేపు ఎల్లుండి విద్యుత్ శాఖా మంత్రి ఆ తరవాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి న‌క్కాఆనంద్ బాబు… ఇలా ప్ర‌తి శాఖ మంత్రినీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టింప‌జేసి, ఓట‌ర్ల‌ను బుట్ట‌లో వేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్న‌ట్లుంది.

{loadmodule mod_custom,GA2}

ఎన్నికల నిబంధన లు అడ్డం వచ్చే లోగా నంద్యాల లో వీలైనంత మేర తమ బృందాలతో మంచి చెయ్యాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇలాంటి ప‌ర్య‌ట‌న‌ల‌కూ..చ‌ర్య‌ల‌కూ ఓట‌ర్లు త‌లొగ్గుతారా? త‌మ నిర్ణ‌యాన్ని అపహాస్యం పాలు చేసిన ఎమ్మెల్యేల‌ను వారు మ‌ళ్ళీ ఆమోదిస్తారా? అనేది చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}eNfv4VkqTcc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -