Thursday, May 16, 2024
- Advertisement -

డేటా చోరీ స్కామ్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణా ప్ర‌భుత్వం…

- Advertisement -

ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైసీపీ అధినేత జగన్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇద‌లా ఉంటే తెలంగాణా ప్ర‌భుత్వం ఈకేసులో స్పీడ్ పెంచింది. డేటా చోరీపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన దర్యాప్తు మొత్తం సిట్ కు బదిలీ చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పని చేయనున్న ఈ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. డీజీపీ కార్యాల‌యంలోనె సిట్‌కు ప్ర‌త్యేక ఛాంబ‌ర్‌ను కేటాయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -