Wednesday, May 15, 2024
- Advertisement -

లిఫ్ట్‌లో ఒంట‌రిగా మూడు రోజులు..

- Advertisement -

రాజ్‌కుమార్ రావు హిరోగా వ‌చ్చిన ట్రాప్‌డ్ మూవీ చూశారా? అందులో హిరో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఓ రూమ్‌లో లాక్ అయిపోతాడు. రక్షించేవారు లేక‌ అప్పుడు అత‌ను ప‌డిన బాధ‌, మ‌నో వేద‌న‌, బ‌య‌ట‌ప‌డ‌టానికి అత‌డు చేసిన ఆలోచ‌న‌లు డైరెక్ట‌ర్ విక్ర‌మాదిత్య క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించాడు. రీల్ విష‌యం వ‌ర‌కు ఓకే. కానీ ఇదే సీన్ రియ‌ల్‌గా జ‌రిగితే ఎలా ఉంటుందో ఊహించ‌డానికే భ‌యాన‌కంగా ఉంటుంది.

కానీ న్యూయార్క్‌లో ఓ మ‌హిళ‌ మూడు రోజుల పాటు లిఫ్ట్‌లో ఇర్కుక్కుపోయింది. వారెన్ స్టిఫెన్స్ అనే బ్యాంక‌ర్ ఇంట్లో ఫోర్ట్‌లిజా అనే 53 ఏళ్ల మ‌హిళ ప‌నిచేస్తుంది. ఓ ఫ్లోర్ నుంచి మ‌రో ఫ్లోర్ కు వెళ్లేందుకు ఆ మ‌హిళ లిఫ్ట్ ఎక్కింది. అదే స‌మ‌యంలో స్టిఫెన్ కుటుంబం హాలిడే ట్రిప్ కోసం బ‌య‌టికి వెళ్లారు. ఉన్న‌ట్టుండి లిఫ్ట్ రెండు అంత‌స్తుల‌కు మ‌ధ్య ఆగిపోయింది. ఎమ‌ర్జెన్సీ బ‌ట‌న్ నొక్కినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో మూడు రోజుల పాటు ఆమె ఆ లిఫ్ట్‌లోనే ఉండిపోయింది. మూడు రోజుల త‌ర్వాత ఓ డెలివ‌రీ బాయ్ రావ‌డం.. లోప‌లి నుంచి శ‌బ్ధాలు రావ‌డంతో ఈ విష‌యం బాహ్య ప్ర‌పంచానికి తెలిసింది. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారు ఆమెను ర‌క్షించారు. ఆమె డీహైడ్రేట్ అయ్యార‌ని.. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఏదేమైనా నీరు, ఆహారం లేకుండా ఓ చిన్న ఇరుకు గ‌దిలో గ‌డ‌పాల్సి రావ‌డం దుర‌దృష్ట‌మే క‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -