ధర్మ పోరాట దీక్ష.. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు ఏపీలో పలు జిల్లాల్లో చేసిన దీక్ష. ఇప్పుడు ఈ దీక్షా శిబిరాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని డిసైడయ్యారు చంద్రబాబు. త్వరలో పార్లమెంట్ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందుగానే బాబు ఈ దీక్ష చేయనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్డీయే సర్కార్ ఏపీని మోసం చేసిందని ఇక్కడి నుంచి నినదించనున్నారు.
హోదా అంటే జైలే గతి… హోదా కావాలంటే గల్లీల్లో కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలి అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా ఉద్యమాన్ని ఎందుకు భూజాన ఎత్తుకున్నారు? ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఆందోళన చేపడితే ఎగతాళి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఢిల్లో దీక్ష చేయడం వెనుక కారణాలేంటీ అని ప్రశ్నిస్తున్నారు. విభజన విషయంలో మోసం చేశారంటూ కాంగ్రెస్‌ను తిట్టిపారేసిన ఆయన.. కాంగ్రెస్‌తో కలిసి దీక్ష చేయనుండటం మరో హైలేట్.
ఎన్నికలే లేకపోతే నాలుగేళ్లుగా గుర్తుకురాని ప్రత్యేక హోదా విషయం చంద్రబాబుకు గుర్తొచ్చేదా? ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చేదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్ష వెనుక రాష్ట్ర ప్రయోజనాల ఏమోగాని… ఎన్నికల్లో సింపథి సాధించడం కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనివైఎస్ఆర్సీపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాదిస్తున్నారు. అసలే ఎన్నికల సమయం కావడంతో ఎన్డీయే వరాల జల్లు కురిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలోనే వేసుకోవాలని టీడీపీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తోందని ఓ టాక్.
