Friday, March 29, 2024
- Advertisement -

టిక్​టాక్​ వచ్చేస్తోంది..!

- Advertisement -

టిక్​టాక్​ యాప్​కు మనదేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ యాప్​ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. టిక్​టాక్​ స్టార్స్​ ఎన్నికల్లో సైతం పోటీచేశారంటే దీనికి ఏ రేంజ్​లో ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం లక్షల సంఖ్యలో టిక్​టాక్​కు యూజర్స్​ ఉండేవారు.

మనదేశంలో టిక్​టాక్​ యాప్​ను నిషేధించిన విషయం తెలిసిందే. గత ఏడాది చైనా- భారత్​ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఆ దేశానికి చెందని పలు యాప్స్​ను భారత ప్రభుత్వం నిషేధించింది. అందులో భాగంగా టిక్​టాక్​ కూడా లేకుండా పోయింది. అయితే టిక్​టాక్​ను పోలిఉండే అనేక యాప్స్​ అందుబాటులోకి వచ్చినప్పటికీ .. అవేవీ ఈ స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు.

అయితే ప్రస్తుతం టిక్​టాక్​ మళ్లీ భారత్​లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నదని సమాచారం. ఇందుకు సంబంధించిన కొన్ని వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఇటీవల భారత ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించినట్టు సమాచారం. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు పాటిస్తామని, తమ యాప్ పునరుద్దరించాలని బైట్‌డాన్స్ ప్రతినిధులు కోరినట్టు సమాచారం. ఈ మేరకు ది ప్రింట్ లో ఓ కథనం ప్రచురితం అయ్యింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే త్వరలో టిక్​టాక్​ మళ్లీ ఇండియాలోకి వచ్చే చాన్స్​ ఉంది.

Also Read

కోవాగ్జిన్​ భేష్… ప్రభావశీలత 77.8

నగరంలో మళ్లీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -