Thursday, April 25, 2024
- Advertisement -

కాంగ్రెస్​ను అధికారంలోకి తెస్తా..!

- Advertisement -

కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కాంగ్రెస్​ లోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఓ వైపు సీనియర్​ కాంగ్రెస్​ నేత కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి పార్టీకీ రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్​కు ఏ పదవులు దక్కకపోవడంతో వాళ్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్​ పలు విషయాలపై మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్​ పార్టీలోని సీనియర్​ నేతలందరినీ తాను కలుపుకొని పోతానని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తమ్​ కుమార్​రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్లలతో మాట్లాడానని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు యాక్షన్​ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన కుటుంబసభ్యులని రేవంత్​ పేర్కొన్నారు. తనకు మల్కాజ్​గిరి టికెట్​ ఇప్పించిందే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అని పేర్కొన్నారు.

ఏది ఏమైనా కాంగ్రెస్​ పార్టీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోమటి రెడ్డి బ్రదర్స్​ మీడియాకు అందుబాటులో లేరు. వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.ఇక పలువురు సీనియర్లు.. ముఖ్యంగా కరీంనగర్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు , ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి సైతం అధిష్ఠానం వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ఈ నేపథ్యంలో రేవంత్​రెడ్డి సీనియర్లను ఎలా కలుపుకుపోతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Also Read

ఉత్కంఠకు తెర.. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం

లూసిఫర్​ రీమేక్​ సరే.. కానీ దర్శకుడే తేలడం లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -