Friday, May 17, 2024
- Advertisement -

చేరికలతో టీఆర్ఎస్ లో కొత్త అలజడి!

- Advertisement -

వివిధ పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నేతలతో తమ పార్టీ బలోపేతం అవుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించుకొంటోంది.

అధికారం లో ఉన్న ఈ పార్టీ లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ ల నుంచి ఎమ్మెల్యేలే వచ్చి చేరారు. ఎమ్మెల్యే పదవులు పోయే అవకాశం ఉన్నా వారు వచ్చి చేరారు. ఇలా వచ్చి చేరిన వారిలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి చేరికలతో టీఆర్ఎస్ యమ ఖుషీగా ఉంది. వీరు ఆయా పార్టీలను వదిలి రావడం వల్ల అవి దెబ్బతినడంతో పాటు.. తాము బలపడతామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొంటున్నారు.

మరి వారి కబుర్లు అలా ఉంటే.. వాస్తవంలో మాత్రం చేరికలు చాలా నష్టమే చేస్తున్నాయనే విషయం కూడా బోధపడుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారు ఊరికే రారు.. వారికి ఏవో పదవుల ఆశలు ఉండనే ఉంటాయి. అలాంటి వారికి ప్రాధన్యత దక్కుతుండే సరికి పాత వారికి మంట మొదలైంది. తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు బాధపడుతున్నారు. ఈ బాధ ఖమ్మం జిల్లాలో పెద్ద గొడవకే దారి తీసింది. అధికార పార్టీలో ని ఈ రకమైన విబేధాలు బాహాబాహీల వరకూ వచ్చాయి. నిన్నలా మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు, ప్రాధాన్యత దక్కుతోందని.. ఎన్నో యేళ్లుగా టీఆర్ఎస్ తరపున పనిచేసిన తమకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యతా దక్కడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమయాల్లో ఇలాంటి విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఇలాంటి వారికి సర్ది చెప్పే పెద్దలు కూడా గులాబీ పార్టీలో ఎవరూ లేరు. దీంతో గ్రూపు తగాలు ఆపరిష్కృతంగా భౌతిక దాడులకు కూడా కారణం అవుతున్నాయి. ఇలాంటివి కచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చేవే. మరి చేరికలతో అంతే మంచే కాదు.. ఇలాంటి రచ్చలు కూడా ఉంటాయని తెరాస అధిష్టానానికి ఈ పాటికే అర్థం అయ్యుండాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -