Sunday, June 16, 2024
- Advertisement -

బాబుతో ముగిస‌న టీటీడీ ఈవో, ఛైర్మెన్ భేటీ…

- Advertisement -

టీటీడీని వ‌రుస వివాదాలు కుదిపేస్తున్నాయి. అక్క‌డ జ‌రుగుతున్న అక్ర‌మాలు, స్వామి వారి న‌గ‌లు పోయిన తీరుపై ఇప్పుడు దుమారం రేగుతోంది. టీటీడీ మాజీ ప్ర‌ధానర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు చేసిన ఆరోప‌న‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.టీటీడీలో జ‌రుగుతున్న అన్ని అక్ర‌మాల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెల్లారు.

వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై చంద్ర‌బాబుతో స‌మావేశ మ‌య్యారు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ , ఛైర్మెన్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పలు విషయాలపై సీఎంకు వివరించామన్నారు అశోక్ సింగాల్ .

టీటీడీ విషయంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలపై తాము చట్టపరంగానే ముందుకు వెళతామని చెప్పారు. దేవాలయ పవిత్రతకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు వెళ్లాలని అన్నారని తెలిపారు. టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పారు

టీటీడీలోని కొన్ని నగలు మాయమయ్యాయంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 1952 నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఏయే నగలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయని, రికార్డులో అన్ని వివరాలు ఉన్నాయని ఈవో అన్నారు. 1952 నుంచి రికార్డులన్నీ పరిశీలించామని, నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -