Saturday, April 27, 2024
- Advertisement -

పక్కా ఆధారాలు… ఆ స్కామ్‌లో మరో ఐదుగురి పేర్లు!

- Advertisement -

టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండగా తీగ లాగితే డొంక దకిలినట్టుగా ఒక్కొక్కరి పేర్లు బయట పడుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఏ1గా చంద్రబాబు ఉండగా లోకేష్ పేరు సైతం పలు స్కామ్‌ల్లో చేర్చింది సీఐడీ. ఇక ప్రధానంగా అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్డు స్కాంలో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. ఇక ఇదే కేసులో ఏ14గా నారా లోకేష్ పేర్చును చేర్చిన సీఐడీ ఇవాళ ఆయన్ని విచారిస్తోంది.

ఇక లోకేష్ విచారణకు ఒక రోజు ముందు టీడీపీ మాజీ మంత్రి నారాయణ సతీమణితో పాటు మరో నలుగురి పేర్లని చేర్చింది. నారాయణ సతీమణి రమాదేవి(ఏ15), బావమరిది రాపూరి సాంబశివరావు(ఏ16),రమాదేవి కజిన్ ఆవుల మునిశేఖర్(ఏ17),ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి పొత్తూరి ప్రమీల(ఏ18),కొత్తాపు వరుణ్ కుమార్(ఏ19)లను నిందితులుగా పేర్కొంది.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా 2022 మే 9న సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మాజీ మంత్రి నారాయణను కూడా విచారించనున్నారు సీఐడీ అధికారులు. దీంతో స్కాంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -