Saturday, April 27, 2024
- Advertisement -

దోపిడి కోసమే అమరావతి!

- Advertisement -

అమరావతి అనేది దోపిడీ కోసమే. టీడీపీ నేతలకు కామధేనువులా మారింది అమరావతి. అందినకాడికి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు తెలుగుదేశం నాయకులు. కానీ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ప్రత్తిపాటికి న్యాయస్ధానం షాక్ ఇవ్వడంతో మరో నేత స్కాం వెలుగులోకి వచ్చింది.

రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చి రోడ్డు వేయకుండానే దోచుకున్నారు ప్రత్తిపాటి. 12 షెల్ కంపెనీలు పెట్టి దోచుకోగా ఆయన తనయుడు ప్రత్తిపాటి శరత్ అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. శరత్ అన్ని కంపెనీలలో 2014 జూన్ లో టీడీపీ అధికారం లోకి వచ్చాకే మొదలు అయ్యాయి. ఫోర్జరీ ఇన్‌వాయిస్‌తో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు శరత్. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ అవెకా కార్పోరేషన్ ప్రయివేట్ లిమిటెడ్ పై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు.

జీఎస్టీ చెల్లింపు కోసం అక్రమంగా ఫోర్జరీ ఇన్వాయిస్ పెట్టి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు నిర్దారణకు రాగా 12 షెల్ కంపెనీల ద్వారా 49.46 కోట్ల రూపాయలు అక్రమ ఇన్‌వాయిస్ చేసినట్లు గుర్తించారు. రూ.8 కోట్లు ఐటీసీ క్లెయిమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని గుర్తించారు. రూ. 16 కోట్ల జరిమానా ప్రతిపాదిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఆర్డీఏ నుంచి కాంట్రాక్టులు – అక్రమ క్లెయిమ్స్ తో ఖజానాకు నష్టం వాటిల్లగా అక్రమ లాభార్జనకు పాల్పడిన లవెక్సా కంపెనీ మాజీ డైరెక్టర్ ప్రత్తిపాటి శరత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించింది న్యాయస్థానం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -