Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ కి అన్నీ కష్టాలే

- Advertisement -

అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలనుకున్న తెలుగుదేశం తెలంగాణ శాఖ ఆ స్థాయికి ఎదగలేకపోగా ప్రస్తుత పరిణామాలతో పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. పార్టీ నేతల్లోనే సఖ్యత లేకపోవడం – పైగా పార్టీ అధిష్టానం చిన్నచూపు ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఒకవైపు ఉద్యమించాలని ఉద్బోధ చేస్తూనే మరోవైపు పార్టీని పట్టించుకోకపోవడం ఏమిటని తెలంగాణ తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో టీఆర్ ఎస్ సర్కారును ఢీకొట్టేలా పార్టీ నాయకత్వం లేకపోవడం ఆమేరకు యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రయత్నాలు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.టీటీడీపీని బలోపేతం చేయాలని కొద్దికాలం క్రితం నిర్ణయించి పార్టీ అధినేత చంద్రబాబు వారంలో ప్రతి శనివారం టీడీపీ యువనేత లోకేశ్ తెలంగాణ శాఖకు సమయం కేటాయిస్తారని గతంలో ప్రకటించారు.

ఒకటిరెండు వారాలు ఈ సౌలభ్యం అమలైనప్పటికీ ఆ తరువాత అది పత్తాలేకుండా పోయింది. నెలలో ఒకరోజు సమావేశమవుదామని హామీ ఇచ్చిన అధినేత చంద్రబాబు మాట సైతం అటకెక్కిందని అంటున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల మహిళ – విద్యార్థి – యువజన – రైతు ఇతర అనుబంధ విభాగాలతో తరువాత బాబు భేటీ అయిన సందర్భంగా పాత పాటే పాడారని టీడీపీ నేతలు వాపోతున్నారు. పార్టీని తెలంగాణలో పటిష్టం చేయాలని కొత్త జిల్లాలకు అనుగుణంగా కమిటీలు వేసేందుకు ప్రణాళిక రూపొందించాలని – ప్రజా సమస్యలపై పోరుబాట వీడరాదని హితవు పలికారు. అయితే రాష్ట్ర నాయకత్వంలో అంతర్గతంగా ఉన్న విభేదాల విషయమై తరచి చూసే ప్రయత్నం చేయడం లేదని ఒకరిద్దరు నేతలు చెబుతున్నారు. పార్టీని పటిష్టం చేయాలని చెప్పినా నాయకుల మధ్య సఖ్యతను పెంచాల్సిన బాధ్యత కూడా అధినేత మీద ఉందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -