Friday, April 26, 2024
- Advertisement -

కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన నర్సు అరెస్ట్!

- Advertisement -

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఎన్ఎన్ ప్రచురించిన ప్రత్యేక కథనం ప్రకారం, ఫ్లోరిడాలో పనిచేస్తున్న నర్సు నివియనీ పిట్టిట్ ఫెల్ఫ్స్, కమలా హారిస్ ను హత్య చేస్తానని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విచారణ జరిపిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఆమెను అరెస్ట్ చేసింది. ఫిబ్రవరిలో 13-18 తేదీల మధ్య కమలా హారిస్‌ను చంపుతానని, శారీరకంగా దాడి చేస్తానని ఫ్లోరిడాకు చెందిన నర్సు నివియానె పెటిట్‌ ఫెల్ప్స్‌ పలుసార్లు బెదిరింపులకు పాల్పడింది.

ఈ మేరకు కేసు నమోదవగా.. యూఎస్‌ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు అనంతరం ఫెల్ప్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, గత సంవత్సరం జరిగిన ఎన్నికల తరువాత కమలా హారిస్, యూఎస్ కు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారన్న సంగతి తెలిసిందే. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్ లో ఆమె పని చేస్తున్నట్టు విచారణ అధికారులు తెలిపారు. కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి.. అని ఆమె వ్యాఖ్యానించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

మరో వీడియోలో, తుపాకితో నిన్ను కాల్చగలిగేంత దగ్గరగా నేను రానున్నాను. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నీది కావచ్చు. కానీ, మరో 50 రోజుల్లో నీకు మరణం తథ్యం. ఇప్పటి నుంచి రోజులు లెక్కబెట్టుకో అని వ్యాఖ్యానించింది. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్‌ తదితరులపై విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ అధికారులు గుర్తించారు. అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫొటోలో ఫెల్ప్స్ షూటింగ్ రేంజ్‌లో తుపాకీ పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఫిబ్రవరిలోనే ఆమె ఆయుధ లైసెన్స్ సైతం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

రెండు రోజులు బయటకు రాకండి.. ఎందుకో తెలుసా?

నేటి పంచాంగం,ఆదివారం(18-04-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -