Thursday, March 28, 2024
- Advertisement -

మహారాష్ట్ర, ఢిల్లీ లో కరోనా డేంజర్ బెల్!

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వరసగా మూడో రోజు కూడా 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 14.95 లక్షల టెస్టులు నిర్వహించగా 2,34,692 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా వైరస్‌కు బలవుతున్నారు.

కాగా, మహారాష్ట్ర, ఢిల్లీలాంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 63,729 కేసులు నమోదు కాగా, 349 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో సైతం అత్యధికంగా 19,486 కేసులు నమోదు కాగా 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మరణాల సంఖ్య పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

రెండు రోజులు బయటకు రాకండి.. ఎందుకో తెలుసా?

నేటి పంచాంగం,ఆదివారం(18-04-2021)

అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -