అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్ వేదిక‌గా జ‌రిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజ‌రైంది. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో మెగా హీరోలు తెగ సంద‌డి చేశారు.

పెళ్లి తరువాత నీహారిక తన సంసారంపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరాలను అభిమానులతో పంచుకుంటూనే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన అల్లుడికి నాగబాబు ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. వాస్తవానికి ఈ కానుక ఉగాది పండుగకే ఇవ్వాల్సి ఉండగా కాస్త ఆలస్యం అయ్యిందని అన్నారు నాగాబాబు.

- Advertisement -

ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. కారు డెలివ‌రీ చేస్తున్న ఫొటోల‌ను నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలానే నాగ‌బాబు కూడా త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు.

నేటి పంచాంగం,ఆదివారం(18-04-2021)

రెండు రోజులు బయటకు రాకండి.. ఎందుకో తెలుసా?

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా కలకలం..

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -