వైసీపీలో మరో విషాదం.. మాజీ మంత్రి మహ్మద్‌ జానీ కన్నుమూత

- Advertisement -

ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. జానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్‌గా పని చేశారు. 1985, 1989లలో గుంటూరు-1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జానీ కాంగ్రెస్‌లో పాతతరం నేతగా గుర్తింపు పొందారు. 1989 నుంచి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యువజన సర్వీసులు, చిన్న పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాలుగేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సేవలు అందించారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి రెండేళ్ల పాటు కొనసాగారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరినప్పటికీ కొంత అసంతృప్తితో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గతేడాది ఆయన కరోనాకి గురైనప్పటికీ క్షేమంగా బయటపడ్డారు.

- Advertisement -

హఠాత్తుగా గుండెనొప్పికి గురవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే చనిపోయారు. ఆయన భార్య ఏడాది కిత్రం మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముస్తాఫా తదితరులు జానీ మృతికి సంతాపం ప్రకటించారు.

కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన నర్సు అరెస్ట్!

మహారాష్ట్ర, ఢిల్లీ లో కరోనా డేంజర్ బెల్!

అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -