Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణలో వలసలపై చర్చ

- Advertisement -

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పలు కార్యక్రమాల కోసం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీని కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితిపై వివరించారు. పార్టీ నుంచి భారీగా జరుగుతున్న వలసలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ లో ఏం చేయాలి అనే అంశాలపై వీరిద్దరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

జరిగిందేదో జరిగింది ఇక ముందు పార్టీ నుంచి వలసలు లేకుండా చూడాలని, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడికి వివరించినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసారు. తెలంగాణ ఇచ్చింది మనమే అయినా.. ప్రస్తుత పరిస్ధితి మరీ దిగజారడానికి కారణమేమిటని దిగ్విజయ్ సింగ్ ఉత్తమ్ కుమార్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. అధికార పార్టీ నుంచి నాయకులకు వస్తున్న హామీల కారణంగానే వారంతా పార్టీ మారినట్లు ఉత్తమ్ కుమార్ సంజాయిషి ఇచ్చుకున్నట్లు తెలిసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -