పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరపడంతో వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. బుధవారం ఉదయం 3.30 గంటలకు భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి దాదాపు 300 మందిని హతమార్చింది. పీవోకేలోని బాలాకోట్ తర్వాత పాకిస్తాన్లోని ముజఫర్ నగర్ లో భారత్ వాయుసేన దాడులకు దిగింది.
దాడుల్లో ముఖ్యంగా బాలాకోట్‌నే ఎంచుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ – పాక్ సరిహద్దుల్లోని బాలాకోట్ కీలకమైన ఉగ్రవాద స్థావర పట్టణం. కొండల్లో జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఇది ఉగ్రవాదుల శిక్షణకు అడ్డగా మారినట్టు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌కు బాలాకోట్ పెట్టని కోట అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే మసూద్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. మసూద్ ర్యాలీలు ఉగ్రవాదులను రిక్రూట్ మెంట్లు ఇక్కడి నుంచే చేసుకుంటాడు. ఇక్కడే చాలాసార్లు బహిరంగ సభలు నిర్వహించాడు. ఉగ్రవాదానికి శిక్షణలు కూడా ఇస్తాడు. ఈ క్యాంప్‌ను అజర్ బావమరిది మౌలానా యూసుఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘోరి ఆధ్వర్యంలో నడుస్తుందని గుర్తించారు. అందుకే బాలాకోట్ పైనే భారత్ గురిపెట్టి ధ్వంసం చేసింది.
ఇక ఈ దాడులకు మిరాజ్-2000 యుద్ధ విమానాలను ఉపయోగించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వీటి చరిత్రను చూస్తే మిరాజ్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ రూపొందించింది. 1970లో తొలిసారి మిరాజ్ విమానాలు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్సులో సేవలందించాయి. కాగా భారత్ చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానాలు సింగిల్ సీటర్ – టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లు ఉన్నాయి. ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్ సెప్ట్ – వార్ మిస్సైల్స్ – మ్యాజిక్-2 మిస్సైల్స్ ను మిరాజ్ యుద్ధవిమానాలు మోసుకెళ్లగలవు. ఈ యుద్ధవిమానాలు గతంలో కార్గిల్ వార్లో కూడా కీలక పాత్ర పోషించాయి. కార్గిల్ వార్ సమయంలో శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి త్రివర్ణ పతకం రెపరెపలాడటంలో మిరాజ్-2000 విమానాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఇంతటీ ఘన చరిత్రతోపాటు మిరాజ్ యుద్ధవిమానాలపై వాయుసేనకు ఉన్న నమ్మకంతో సర్జికల్స్ స్ట్రైక్-2లో వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది.