Sunday, May 19, 2024
- Advertisement -

ఆస్తమా..వీటిని అస్సలు టచ్‌ చేయకండి!

- Advertisement -

ఇవాళ ప్రపంచ అస్తమా దినోత్సవం. రోజురోజుకు పెరిగి పోతున్న అస్తమా వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు అస్తమా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆస్తమా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య. దీనికి చికిత్స లేదు..అవగాహన ద్వారా ఆరోగ్యవంతంగా ఉండటం ఒక్కటే మార్గం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 340 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. అస్తమా సమస్య ఉంటే శ్వాసనాళాలు ఉబ్బి.. ఇరుకుగా మారి.. దగ్గు, గురక, శ్వాసలో ఇబ్బందులు కలిగిస్తాయి.

అస్తమా ఉన్న వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తాజా, పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. తాజా పండ్లు, కూరగాయలతో మంచి ఫలితం ఉంటుంది. ఆహారంలో పాలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆకుకూరలు, బీటా కెరోటిన్ అధికంగా ఉండే కూరగాయలు, గుమ్మడి గింజలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఆస్తమాకు చికిత్స తీసుకున్న పూర్తిగా తగ్గదు. లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తే అస్తమాను కంట్రోల్ చేయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -