Saturday, April 27, 2024
- Advertisement -

ఈమెకు 23 మంది భర్తలు.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..!

- Advertisement -

పెళ్లిల్లు చేసుకొని కూడా రికార్డులు సృష్టించవచ్చా.. అంటే కచ్చితంగా సృష్టించవచ్చు. 33 పెళ్లిల్లు చేసుకొని రికార్డుల కెక్కిన జియోనా చానా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన తన 33 మంది భార్యలు.. తమ పిల్లలు, మనవలు, మనమరాళ్లతో ఒకే చోట ఉన్నాడు. పైగా అన్ని పెళ్లిళ్లు చేసుకోవడం వాళ్ల తెగ సంప్రాదాయం. ఇదిలా ఉంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న పురుషుడే కాదు.. ఓ మహిళ కూడా ఉంది. ఆమె ఇప్పటికీ 23 మందిని వివాహం చేసుకున్నది.

అయితే జియోనా చానాకు ఈమెకు చిన్న తేడా ఉంది. అదేమింటే.. ఆయన తన భార్యలతో కలిసి ఉంటున్నారు. ఈమె మాత్రం.. ఒక్కో భర్తతో విడాకులు తీసుకుంటూ చివరకు 23 మందిని పెళ్లి చేసుకుంది. అందుకు కారణం ఆమె శాడిస్టు భర్తలు. వాళ్ల టార్చర్​ తట్టుకోలేక.. ఆమె ఒక్కడితో కూడా సవ్యంగా కాపురం చేయలేకపోయింది. కొంత మంది ఆమెను కొట్టారు. మరికొందరు మానసికంగా చిత్రవధ చేశారు.

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో నివాసం ఉంటున్న లిండా లో టేలర్ వుల్ఫ్ ప్రపంచంలో అత్యధిక పెళ్లిలు చేసుకున్న మహిళగా రికార్డుల కెక్కారు. ఆమె ఇప్పటివరకు 23 మందిని పెళ్లి చేసుకున్నారు. లిండా చివరగా.. 1996లో గ్లిన్ ‘స్కాటీ’ వుల్ఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గ్లిన్ అప్పటికే 28 పెళ్లిళ్లు చేసుకున్నారు. 29వ పెళ్లి కూడా చేసుకొని రికార్డు సృష్టించడం కోసం లిండాను వివాహమాడారు. పెళ్లయిన ఏడాదికే 1997లో గ్లిన్ కన్నుమూశారు. లిండా తొలిసారి 1957లో 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుందట. ఆమె తొలిభర్త జార్జ్ స్కాట్ వయసు అప్పటికే 31. ఏడేళ్లపాటు వీళ్ల సంసారం సాగింది.

Also Read

హమ్మయ్య.. భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

జియాన్‌ఘాకా .. 39 మంది భార్యలకు భర్త.. ఇంకా చనిపోలేదట.. ఈ ట్విస్ట్ ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -