నారప్ప విడుదలకు సిద్ధం..!

కరోనా లాక్​డౌన్​ తో సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఫస్ట్​వేవ్​లో దారుణంగా నష్టాలను చవిచూసిన ఇండస్ట్రీ.. సెకండ్​వేవ్​లో మరింత ఇబ్బందులు పడుతున్నది. ఇదిలా ఉంటే ఫస్ట్​వేవ్​ అనంతరం లాక్​డౌన్​ నిబంధనలు సడలించడంతో కొన్ని సినిమాలు విడదలయ్యాయి. అంతలోనే సెకండ్​వేవ్​ ముంచుకొచ్చింది. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం క్రమంగా కరోనా ఉధృతి తగ్గుతున్నది. ఈ క్రమంలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ కావచ్చన్న టాక్​ వినిపిస్తోంది. దీంతో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

టక్​జగదీశ్​, లవ్​స్టోరీ, విరాటపర్వం, ఖిలాడి వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకున్నాయి. వెంకటేశ్​, శ్రీకాంత్​ అడ్డాల కాంబి నేషన్​లో నారప్ప చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్​ అయిన అసురన్​కు ఈ మూవీ రీమేక్​. తమిళంలో టైటిల్ రోల్​ను.. ధనుష్​ పోషించారు.

అయితే తెలుగులో వెంకటేశ్​ ఈ పాత్రను చేస్తున్నారు. ఇది వెంకటేశ్​కు ఎంతో చాలెంజింగ్​ రోల్​ అని నిర్మాతలు అంటున్నారు. గతంలో వెంకటేశ్​ ఎప్పుడూ ఇటువంటి రోల్​ చేయలేదు. ఇప్పటికే విడుదలైన టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకటేశ్​ లుక్స్​ కూడా అద్భుతంగా ఉన్నాయి. నిజానికి ఈ మూవీ మే 14 న రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ తో ఆగిపోయింది. ఈ మూవీలో వెంకటేశ్​ భార్య గా ప్రియమణి నటిస్తున్నది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయ్యింది. త్వరలోనే రిలీజ్​ డేట్ ను అనౌన్స్​ చేస్తామని ప్రొడ్యూసర్లు ప్రకటించారు.

Also Read

తారక్​ మూవీలో విజయ్​ సేతుపతి..! ఏ క్యారెక్టర్​ అంటే?

ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ డేట్​ ఫిక్స్​.. మరి రిలీజ్​ ఎప్పుడో?

త్వరలో శాకుంతలం షూటింగ్​ .. కీలక సన్నివేశాల చిత్రీకరణ..!

Related Articles

Most Populer

Recent Posts