హమ్మయ్య.. భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

- Advertisement -

రెండు నెలల క్రితం భారత్ లో కరోనా సెకండ్ వేవ్ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజుకి నాలుగు లక్షల కేసులు నమోదు అయ్యాయంటే దీని ప్రభావం ఎంతగా ఉందో తెలిసింది. కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమల్లోకి తీసుకు వచ్చారు. దాంతో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,224 మంది కరోనా బారినపడ్డారని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,07,628 మంది కరోనా నుంచి కొలుకున్నారని, 2,542 మంది కరోనాతో చనిపోయారని వారు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,79,573కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,83,88,100 మంది కోలుకున్నారు. 8,65,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,19,72,014 మందికి వ్యాక్సిన్లు వేశారు. వరుసగా 34వ రోజు రోజువారీ రికవరీ కేసులు కొత్త కేసులను మించి పోయాయని, రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని వారు వెల్లడించారు. వ్లీకీ ప్లాజిటివిటీ రేటు 5 శాతానికి కన్నా తక్కువకు పడిపోయిందని, ప్రస్తుతం 4.17శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -