Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ నేతలపై మంత్రి బొత్స సెటైర్లు…

- Advertisement -

ఏపీలో ఇసుక కొరత, రాజధాని మంటలు చల్లారంటంలేదు. వైసీపీ, టీడీపీ ల మధ్య మాటల యుద్ధం ముమ్మరస్థాయిలో సాగుతోంది. ఇసుక కొరతకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇసుకు కొరతకు ప్రభుత్వమే కారణమని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.

ఇసుకపై సంపాదన పోతుందనే ఆందోళనతోనే టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందంటూ మండి పడ్డారు.విజయనగరం జిల్లా ప్రగతిపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నఆయన గత ఐదేళ్లుగా టీడీపీ నేతలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని విమర్శించారు. ఇసుక పాలసీకి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో వారి సంపాదన సరిపోతుందె ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు.

కొత్త ఇసుక పాలసీ అమలుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఈ విషయం పట్ల ప్రజల్లో అవగాహన కలిగినా, టీడీపీ నేతలకు మాత్రం అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.ఇసుకపై తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -