Thursday, May 16, 2024
- Advertisement -

బీప్ సాంగ్ విషయంలో యూ ట్యూబ్ పోలీసులకి షాక్ ఇచ్చింది

- Advertisement -

త‌మిళ‌నాట ఈ మ‌ధ్య బీప్ సాంగ్ ఒక ఊపు ఊపిన సంగ‌తి తెలిసిందే. నటుడు శింబు ఆల‌పించిన ఈ పాట యూట్యూబ్‌లోకి ఎలా వ‌చ్చిందో తెలీదుగానీ పెద్ద సంచ‌ల‌న‌మే అయిపోయింది. ఆపాట‌లోని సాహిత్యం ఎంతోమంది మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా ఉన్నాయంటూ పెద్ద వివాద‌మే చెల‌రేగింది. ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ పాట అతి త‌క్కువ కాలంలో దాదాపు 10 ల‌క్ష‌ల‌కు పైగా హిట్స్‌ను న‌మోదు చేసుకుంది.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఈ పాట వైర‌ల్ అయిపోయింది. ఇంకోప‌క్క శింబుపై కేసు కూడా న‌మోదైంది. ప‌లు ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ పాట‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. అయితే, పోలీసుల‌కు యూట్యూబ్ యాజ‌మాన్యం షాక్ ఇచ్చింది.ఈ వివాదానికి వీలైనంత త్వ‌ర‌గా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని సిటీ క్రైమ్ ఇన్వ‌స్టిగేటింగ్ ఆఫీస‌ర్లు పోలీసుల‌ను ఆదేశించారు.

యూట్యూబ్‌లో ఉన్న పాట‌ల‌ను తొలించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వారు సూచించ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూట్యూబ్ యాజ‌మాన్యాన్ని ఆఘ‌మేఘాల మీద క‌లుసుకున్నారు. ఆ పాట అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌నీ, ఎంతోమంది మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉన్నాయ‌నీ, త‌మిళ‌నాట పెద్ద వివాద‌మైంద‌ని యాజ‌మాన్యానికి పోలీసులు వివ‌రించారు. అయితే, ఆపాట‌లోని సాహిత్యం ఏంటో త‌మ‌కి అర్థం కావ‌డం లేద‌ని, ఆ భావాన్ని ఆంగ్లంలో త‌ర్జుమా చేసి ఇవ్వాల‌ని యూట్యూబ్ కోరింది.

దీంతో పోలీసులు ట్రాన్సిటేష‌న్ చేయించి ఇచ్చారు. ఆ కంటెంట్ చ‌దివిన త‌రువాత ఇందులో అభ్యంత‌ర‌క‌మైన విష‌యం ఏముంది? ఈ పాట‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించాల్సినంత ఇబ్బందిక‌రంగా లేదంటూ చెప్పేశారు! దీంతో పోలీసులు షాక్ తిన్నారు. దీంతో పోలీసులు కూడా చేసేందేం లేక కేసును డీల్ చేసే యాంగిల్ మార్చుకున్నారు. ఇంత‌కీ ఈ వీడియో ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చింది? దీన్ని యూట్యూబ్లో తొలిగా ఎవ‌రు అప్‌లోడ్ చేశారు అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -