Friday, April 26, 2024
- Advertisement -

మాస్కు పెట్టుకో సిన్నప్పా.. నారప్పను ఇలా వాడుకున్నారా?

- Advertisement -

ఇటీవల సైబరాబాద్​ పోలీసులు ఎంతో యాక్టివ్ ​అయ్యారో చూస్తూనే ఉన్నాం. సోషల్​ మీడియా ద్వారా ట్రాఫిక్​ రూల్స్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం మీమ్స్​ తయారుచేసి వదులుతున్నారు. సోషల్​ మీడియాలో మీమ్స్​ హడావుడి అంతా ఇంతా కాదు. పది వాక్యాల్లో చెప్పే విషయాన్ని చిన్న మీమ్​ ద్వారా చెప్పొచ్చు. అది కూడా ఎంతో ఫన్నీగా.. నెటిజన్లకు అర్థమయ్యేలా వివరించవచ్చు. దీంతో రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా మీమ్స్​ క్రియేట్​ చేస్తున్నారు.

ఇటీవల అమేజాన్​ ప్రైమ్​లో నారప్ప సినిమా విడుదలై మంచి టాక్​ తెచ్చుకున్నది. దీంతో ఈ సినిమాలోని ఓ సన్నివేశంతో మీమ్ క్రియేట్​ చేశారు సైబరాబాద్​ పోలీసులు. ‘ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా. మాస్కు పెట్టుకో సిన్నప్పా. ఇంకా కరోనా పోలేదు సిన్నప్ప’ అంటూ ఓ మీమ్​ను తయారుచేశారు సైబరాబాద్​ పోలీసులు. ఇక ఈ మీమ్​ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది.

సైబరాబాద్​ పోలీసులు ఎంతో సున్నితంగా మాస్కు పెట్టుకోవాలన్న విషయాన్ని చేరవేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఆర్​ఆర్​ఆర్​ మూవీ నుంచి ఓ పోస్టర్​ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రామ్​చరణ్​, తారక్​ హెల్మెట్​ లేకుండా బైక్ పై ప్రయాణిస్తుంటారు. ఈ పిక్​ను కూడా సైబరాబాద్​ పోలీసులు వాడుకున్నారు. వాళ్లు హెల్మెట్​ లేకుండా ప్రయాణిస్తున్నారని.. మీరూ అలాగే హెల్మెట్​ లేకుండా ప్రయాణిస్తే యమపురికి పోతారంటూ హెచ్చరించారు. ఇలా ప్రతి సినిమాను, సినిమా పోస్టర్​ను సైతం సైబరాబాద్​ పోలీసులు వాడుకుంటూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -