Monday, May 20, 2024
- Advertisement -

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని మోదీకి లేఖ‌రాసిన జ‌గ‌న్‌..

- Advertisement -

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును మరోసారి సమీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని చెప్పారు. సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీలను అభద్రతాభావానికి గురి చేస్తాయని అన్నారు.

భారత రాజ్యంగం కుల రహిత సమాజాన్ని కోరుకుంటోందని తెలిపారు. మరోవైపు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చిన రూలింగ్ ను మరోసారి సమీక్షించాలని పిటిషన్ లో కోరింది.

రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని పేర్కొన్నారని గుర్తుచేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -