Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబు బుద్ధి మరొకసారి బయటపడింది – ఎక్కడ చూసినా అరస్ట్ లు :

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా ఇవ్వడం జరిగేపని కాదు అంటూ అరుణ్ జైట్లీ తేల్చి చెప్పగానే ఆంధ్ర ప్రదేశ్ లో సాధారణంగానే విపక్షాలు మంగళవారం అంటే ఇవాళ బంద్ కి పిలుపునిచ్చాయి. వైకపా కి చెందిన నేతలతో పాటు ఇతర నేతలు కూడా ఉదయం నుంచీ రోడ్ల మీద బిజీ గా ఉన్నారు. బంద్ ప్రకటించింది వైకపా నే కావడం తో రోడ్డు మీద ఆర్టీసీ బస్సులు కూడా రాకుండా అడ్డుకున్నారు వారు.

షాపులు మూయించడం కూడా చేస్తున్నారు. విద్యా సంస్థలు కూడా ఇవాళ బంద్ ప్రకటించాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతల అత్యుత్సాహం తప్ప ఎక్కడా ఇబ్బందికర పరిణామాలు లేవు. ఇలాంటి నాయకులని కట్టడి చెయ్యడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. అవసరం ఉన్నా లేకపోయినా నిరసన చేస్తున్న వారిని అరస్ట్ చేస్తూ ఉండడం తో పోలీసుల మీద వైకపా శ్రేణులు సీరియస్ గా ఉన్నాయి.

బంద్ విషయం లో విపక్షం వారు రెచ్చిపోయి అన్నీ పగలగొడితే అరస్ట్ చెయ్యడం లో తప్పు లేదు గానీ అలాంటిదేమీ లేకున్నా.. పోలీసుల హడావుడి చేయటం వల్ల అధికారపక్షంపై నెగిటివ్ మార్క్ పడుతుంది. న్యాయమైన అంశం మీద.. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే.. అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్న భావన ప్రజలకు కలిగితే.. హోదా విషయంలో అధికారపక్షం అంత కమిట్ మెంట్ తో పని చేయటం లేదనిపించటం ఖాయం. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -