Friday, May 17, 2024
- Advertisement -

తెలంగాణ‌లో మంత్రి ప‌ద‌విపై అసంతృప్తి లేదంటున్న సినీ న‌టుడు

- Advertisement -

సినీ రంగంలో హాస్య‌న‌టుడిగా క‌డుపుబ్బా న‌వ్వించిన బాబు మోహ‌న్ ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న నంద‌మూరి తారక రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ మంత్రిగా ప‌నిచేశారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌కు చెంద‌ని బాబు మోహ‌న్ మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2009లో ఓట‌మి అనంత‌రం తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొని టీఆర్ఎస్‌లో చేరారు.

2014 ఎన్నిక‌ల్లో బాబు మోహ‌న్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఈ స‌మ‌యంలో బాబు మోహ‌న్‌కు మంత్రి ప‌ద‌వి తెలంగాణ తొలిమంత్రివ‌ర్గంలోనే అవ‌కాశం వ‌స్తుంద‌ని భావించ‌గా అలాంటిది రాలేదు. ఎందుకంటే సీనియ‌ర్ వ్య‌క్తి.. గ‌తంలో మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం కూడా ఉండ‌డంతో బాబు మోహ‌న్ మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఓ సంద‌ర్భంలో మ‌ళ్లి ఒక‌సారి మంత్రి ప‌ద‌విపై మాట్లాడారు.

‘‘ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన బాబు మోహ‌న్ తెలంగాణలో త‌న‌కు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఏ మాత్రం లేదని పేర్కొన్నారు. సేవకు పదవులు అవసరం లేదని, పేదలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడడ‌మే ప్రజాప్రతినిధుల బాధ్యత అని చెప్పారు. డబ్బు, రాజకీయాలు తనకు అలవాటు లేదని, ప్రజలకు సేవ చేస్తే వారే మనల్ని గెలిపిస్తారు అని తెలిపారు.

నటించడం తనకు వృత్తి అయితే, రాజకీయాలు.. సేవ చేయడానికి వేదిక అని పేర్కొన్నారు. సినిమాకు దూరం అవ్వడమనేది జరగదని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -