Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీకి బాబు మోహన్..కాంగ్రెస్‌కు సుభాష్ రెడ్డి రాజీనామా!

- Advertisement -

తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. బీజేపీ సెకండ్ లీస్ట్ వరకు తన పేరును ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బాబు మోహన్. ఒకవేళ ఇప్పుడు తనకు టికెట్ కేటాయించినా పోటీ చేయనని స్పష్టం చేశారు. మరోవైపు ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, సుభాష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు కాకుండా మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించడంపై కంటతడి పెట్టుకున్న ఆయన రేవంత్‌పై నిప్పులు చెరిగారు. రేవంత్ టికెట్లను అమ్ముకున్నాడని, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడమే తనముందున్న కర్తవ్యమని తేల్చి చెప్పారు.

ఇక బాబు మోహన్…తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అయిందని…పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయని.. తాను ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. కావాలనే తనను పార్టీకి దూరం పెట్టినట్లు విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో తన కుమారునికి తనకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందని…చివరికి కుటుంబంలో కూడా బీజేపీ చిచ్చుపెట్టిందన్నారు. ఇక గాంధీ భవన్‌ ముందు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణు వర్థన్ రెడ్డి అనుచరులు హంగామా చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు చింపేశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీస్ట్ ఆ పార్టీలో అగ్గి రాజేసిందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -