Sunday, May 19, 2024
- Advertisement -

అఖిల‌ప్రియ‌ను మంత్రిగా చంద్ర‌బాబు భ‌రించేది అందుకేనా..?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి క‌ర్నూలు జిల్లాలో ఎవ‌రూ ఊహించ‌నంత‌గా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోనున్నాయి. జిల్లాలో టీడీపీ ప‌ట్టు సాధించేందుకు బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. జ‌గ‌న్‌ను రాయ‌ల‌సీమ‌లో దెబ్బ‌ట్టాల‌న్న‌ది బాబు వ్యూహం. ఆదిశ‌గా ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్నారు.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు అఖిల‌ప్రియ‌. అయితే మంత్రిగారి వ్య‌వ‌హారం బాబుకు న‌చ్చ‌డంలేదంట‌. మంత్రిగా నిరూపించుకోవ‌డంలో విల‌మ‌య్యింద‌నే చెప్పాలి. ప్రస్తుతం ఆళ్ళగడ్డ నుండి ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి భూమా అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కేది అనుమానమేనట.

భూమా సెంటీమెంట్‌ను గైర‌వించి అఖిల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండాలంటే నంద్యాల ఎంపీగా పోటీ చేయ‌డం త‌ప్ప వేరే మార్గంలేద‌ని టీడీపీలోని వ‌ర్గాలు భావిస్తున్నాయి. అఖిల మీదకానీ నంద్యాల ఎంఎల్ఏగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి మీదగాని చంద్రబాబునాయుడుకు ఏమంత సదభిప్రాయం లేదంట‌.

మంత్రిగా ప‌నితీరుకూడా ఆశించిన స్థాయిలో లేదంట‌. మ‌రో వైపు జిల్లాలోని సీనియ‌ర్ నేత‌ల‌తో ఎవ‌రితోనూ స‌ఖ్య‌త‌గా లేద‌న్న‌ది తెలిసింది. నియోజకవర్గంలో తండ్రి భూమా నాగిరెడ్డి మృతి తాలూకు సెంటిమెంట్ మాత్రం ఉందని ప్రచారంలో ఉంది. అందుకనే అఖిలను భరించక తప్పటం లేద‌ని చంద్ర‌బాబు స‌న్నిహితుల వ‌ద్ద చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై కూడా బాబుకు న‌మ్మ‌కం లేదంట‌. ఆళ్ళగడ్డ నుండి అఖిల స్ధానంలో గంగుల ప్రతాపరెడ్డిని పోటీలోకి దింపాలని చంద్రబాబు అనుకుంటున్నారట. నంద్యాల ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి స్ధానంలో చంద్రబాబే పోటీ చేసే అవకాశం ఉందంటూ జిల్లాలో బాగా ప్రచారం జరుగుతోంది. మ‌రో వైపు లోకేష్ సేఫ‌జోన్ కుప్పంనుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు వాడుకొని వారిని గాలికొదిలేయ‌డం బాబుకు వెన్నుతో పెట్టిన విద్యే. మ‌రి అఖిల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంట‌న్న‌ది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -